ముందెప్పుడూ చూడని పాత్రలో మహేష్ బాబు

ముందెప్పుడూ చూడని పాత్రలో మహేష్ బాబు
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, పివిపి, అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 9 వ తారీకు న విడుదల కానుంది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు ఈ మధ్యనే 'ఎఫ్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాలో ఒక మిలిటరీ మ్యాన్ గా కనిపించనున్నాడట. ఇప్పటి దాకా ఇలాంటి పాత్ర మహేష్ బాబు ఎప్పుడూ చేయలేదు. కాబట్టి ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. మిలిటరీ ఆఫీసర్ గా మహేష్ బాబు లుక్స్ ఎలా ఉంటాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. దిల్ రాజు మరియు అనిల్ సుంకర ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గురించి పలు పేర్లు వినిపించినప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories