Dilip Kumar Youngest Brother Ehsan Khan died : మ‌రో సోద‌రుడిని కోల్పోయిన బాలీవుడ్ నటుడు

బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన మరో తమ్ముడు..

Raj
By Raj
Published on: 3 Sept 2020 10:23 AM IST
Dilip Kumar Youngest Brother Ehsan Khan died : మ‌రో సోద‌రుడిని కోల్పోయిన బాలీవుడ్ నటుడు
X

బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన మరో తమ్ముడు ఇషాన్ ఖాన్ బుధవారం రాత్రి లీలవతి ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన COVID-19 తో మరణించాడని.. గతంలోనే ఆయనకు గుండె జబ్బులు, రక్తపోటు, అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నాడని ఆసుపత్రి నుండి ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇషాన్ ఖాన్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి 11 గంటలకు కన్నుమూశారు. కాగా గ‌త నెల‌లోనే దిలీప్‌కుమార్ సోద‌రులు అస్లాంఖాన్‌, ఇషాన్ ఖాన్‌లు కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో ముంబైలోని లీలావ‌తి ఆస్పత్రి‌లో చేరారు.

అయితే చికిత్సలో ఉండగానే అస్లాం ఖాన్ చ‌నిపోయారు. అస్లాం ఖాన్ కు కూడా కొంతకాలంగా గుండెజ‌బ్బు, అధిక ర‌క్త‌పోటు వంటి స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఇంత‌లో క‌రోనా రావ‌డంతో ఆయన ఆరోగ్యం మ‌రింత క్షీణించి కన్నుమూశారు. ఇక ఈ ఘటన మరవకముందే మరో సోదరుడు కన్నుమూయడం దిలీప్ కుటుంబసభ్యులను పెను విషాదానికి గురిచేసింది. దిలీప్ సోదరుడి మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Raj

Raj

Next Story