దిల్ రాజు భారీ స్టూడియో.. ఎక్కడ నిర్మిస్తున్నారంటే..!

Dil Raju: ఫిలిం స్టూడియో నిర్మించనున్న దిల్ రాజు

Rama Rao
Updated on: 5 July 2022 1:12 PM IST
Dil Raju Will Build His Own Film Studio | Tollywood News
X

Dil Raju: ఫిలిం స్టూడియో నిర్మించనున్న దిల్ రాజు

Dil Raju: ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ ఆయన దిల్ రాజు తాజాగా ఇప్పుడు తన పేరు మీద ఒక సొంత స్టూడియో ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అతి తొందరలోనే హైదరాబాద్ శివార్లలో పెద్ద ఫిలిం స్టూడియో ని ఏర్పాటు చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఈ స్టూడియోని నిర్మించాలని దిల్ రాజు అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పటికే దిల్ రాజు శంషాబాద్ లో ఒక పెద్ద స్థలాన్ని కొనుగోలు చేశారని తెలుస్తోంది. అక్కడే దిల్ రాజు తన పేరు మీద ఒక ఫిలిమ్స్ స్టూడియో ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే తన తదుపరి సినిమా "వారసుడు" కోసం దిల్ రాజు కొన్ని భారీ సెట్లను కూడా ఏర్పాటు చేశారట. ఇక ఈ సినిమా పనులు పూర్తయిన తర్వాత ఈ స్టూడియో గురించి దిల్ రాజు మరింత ఫోకస్ పెట్టనున్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఫిలిం స్టూడియో లకి బాగానే డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఇతర భాషల సినిమాల షూటింగ్ కోసం హైదరాబాద్ కి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఒక ఫిలిం స్టూడియోని నిర్మిస్తే చాలా బాగుంటుందని దిల్ రాజు ఈ నిర్ణయానికి వచ్చారట. దీని గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story