దిల్ రాజు వైఖరితో విసిగి పోయిన నిర్మాతలు

Dil Raju Who Misses his Word Again
x

దిల్ రాజు వైఖరితో విసిగి పోయిన నిర్మాతలు

Highlights

Dil Raju: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు పేరు ముందే ఉంటుంది.

Dil Raju: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు పేరు ముందే ఉంటుంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఆయనపై మరియు ఆయన మాటపై గౌరవం కూడా ఉంది. కానీ ప్రస్తుతం దిల్ రాజు డబుల్ స్టాండర్డ్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీంతో దిల్ రాజు ఇమేజ్ బాగా డామేజ్ అవుతున్నట్లు చెప్పుకోవచ్చు. దిల్ రాజు చేస్తున్న పనులు చూసి మిగతా నిర్మాతలు అందరూ ఆయనను హేళన చేస్తూ సెటైర్లు కూడా వేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే సినిమా టికెట్ రేట్లు నుంచి షూటింగుల బంద్ వరకు ఒక్క విషయంలో కూడా దిల్ రాజు తన మాటపై నిలబడకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతుంది. టికెట్ రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చాలా తగ్గించామని దిల్ రాజు ప్రకటించారు కానీ ఈ మధ్యనే ఇద్దరు స్టార్లతో మల్టీస్టారర్ సినిమాని విడుదల చేసిన దిల్ రాజు టికెట్ రేట్లను ఏమాత్రం తగ్గించలేదు. దీంతో సోషల్ మీడియాలో దిల్ రాజు పై విమర్శలు మొదలయ్యాయి.

తాజాగా ఇప్పుడు నిర్మాతల సమస్యలకు పరిష్కారం దొరికే వరకు తెలుగు సినిమా షూటింగులన్నీ బంద్ అవుతాయంటూ ప్రకటించారు. ఆగస్టు 1 నుండి చాలా వరకు తెలుగు సినిమాల షూటింగ్ లు ఆపేసారు కూడా. కానీ దిల్ రాజు తన "వారసుడు" సినిమా షూటింగ్ మాత్రం యదేచ్ఛగా జరిపిస్తున్నారు. ఏమన్నా అంటే అది తమిళ్ సినిమా అని చెప్పి తప్పించుకోవడంతో మిగతా నిర్మాతలు కూడా షాక్ అయ్యారు. ఇలా మాట మీద నిలబడకుండా ఇలాంటి లాజిక్కులు చెప్పి తప్పించుకోవటం దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతకి ఏ మాత్రం మంచిది కాదు అంటూ అభిమానులు సైతం మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories