Dil Raju: మరొకసారి ప్లేట్ మార్చి దొరికిపోయిన దిల్ రాజు

Dil Raju was Caught Changing the Plate once Again
x

Dil Raju: మరొకసారి ప్లేట్ మార్చి దొరికిపోయిన దిల్ రాజు

Highlights

Dil Raju: ఇంత హడావిడి చేసి చివరికి మాట మార్చేసిన దిల్ రాజు..

Dil Raju: ఈ మధ్యకాలంలో ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కోలా మాట్లాడుతూ దిల్ రాజు ఎప్పటికప్పుడు ప్లేట్ మారుస్తూ నెటిజన్లకు దొరికిపోతున్నారు. 2019 లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పండుగ సమయంలో డబ్బింగ్ సినిమాల కంటే తెలుగు సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు దిల్ రాజు. కానీ మళ్లీ అదే దిల్ రాజు సంక్రాంతి సందర్భంగా విజయ్ డబ్బింగ్ సినిమా "వారసుడు" ను విడుదల చేస్తూ డైరెక్ట్ సినిమా, డబ్బింగ్ సినిమా అని లేదని ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా మార్కెట్ మాత్రమే నడుస్తుందని ప్లేట్ మార్చేశారు.

ఆ తర్వాత తమిళ్లో అజిత్ కంటే విజయ్ కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందని, కాబట్టి అజిత్ సినిమా కంటే విజయ్ సినిమాకి ఎక్కువ థియేటర్లు రావాలని కామెంట్లు చేశారు. మరోవైపు తెలుగులో చిరంజీవి మరియు బాలకృష్ణ లతో పోలిస్తే విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా చాలా తక్కువ. కానీ ఈ ఇద్దరు హీరోల కంటే ఎక్కువ విజయ్ కోసం థియేటర్లు తీసేసుకున్నారు దిల్ రాజు. ఏమన్నా అడిగితే రెండు సినిమాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారికి లేని బాధ మిగతా వారికి ఎందుకు అంటూ కామెంట్లు చేశారు. నిజానికి జనవరి 12న బాలకృష్ణ సినిమాకి పోటీగా "వారసుడు" సినిమాని విడుదల చేయాలి. కానీ రెండు సినిమాలు ఒకేసారి విడుదల చేస్తే కలెక్షన్లు రావేమోనని భయపడ్డ దిల్ రాజు సినిమాని "వారసుడు" సినిమాని 11వ తేదీనే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

తాజాగా ఇప్పుడు కొన్ని కారణాలవల్ల సినిమా విడుదల ను జనవరి 14కి వాయిదా వేశారు. ముందు చిరంజీవి బాలకృష్ణ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రెండు సినిమాలకు కావాల్సిన థియేటర్లు ఇచ్చాకే తన సినిమాని విడుదల చేస్తున్నాను అని ఇప్పుడు మళ్లీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు దిల్ రాజు. అయితే సినిమా తమిళ్ వర్షన్ మాత్రం 11వ తేదీన విడుదల కాబోతోంది. ఒకవేళ సినిమా ఫ్లాప్టాప్ తెచ్చుకుంటే తెలుగులో ఈ సినిమాని ఫ్రీగా చూపిస్తామన్నా ఎవరూ టికెట్లు కొనరు. మరి ఈ సినిమా విషయంలో ఇన్ని మాటలు మార్చిన దిల్ రాజు ఈ సినిమాతో ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories