Dil Raju vs Mahesh Babu: ఈ వేసవిలో దిల్ రాజు వర్సెస్ మహేష్ బాబు

Dil Raju vs Mahesh Babu: థియేటర్లలో క్లాష్ అవ్వబోతున్న మహేష్ బాబు మరియు దిల్ రాజుల సినిమాలు

admin1
Updated on: 24 Feb 2022 1:00 PM IST
Dil Raju vs Mahesh Babu This Summer | Telugu Movie News
X

Dil Raju vs Mahesh Babu: ఈ వేసవిలో దిల్ రాజు వర్సెస్ మహేష్ బాబు

Dil Raju vs Mahesh Babu: కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమాలన్నీ ఇప్పుడు వరుసగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా "ఎఫ్ 3" మరోవైపు అడవి శేష్ నటిస్తున్న "మేజర్" సినిమాలు ఒకే రోజున థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. రెండు చిత్రాల దర్శక నిర్మాతలు తమ సినిమా మే 27న విడుదల అవుతుంది అని అధికారికంగా ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న "ఎఫ్ 2" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

ఆ సినిమాకి సీక్వెల్ గా "ఎఫ్ 3" త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక 26 ముంబై ఎటాక్ ఆధారంగా "మేజర్" సినిమా ముందుకి రాబోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా కథ ఉండబోతోంది. శశి కిరణ్ టిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మహేష్ బాబు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వేసవి కాలంలో దిల్ రాజు మరియు మహేష్ బాబు ల సినిమాలు థియేటర్లలో క్లాష్ కాబోతున్నాయి. మరి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాయో వేచి చూడాలి.

admin1

admin1

Next Story