Vaarasudu: విజయ్ ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్న దిల్ రాజు

* ప్రమోషన్ల విషయంలో విజయ్ ని దిల్ రాజు కన్విన్స్ చేయగలరా?

Arun Chilukuri
Published on: 15 Dec 2022 7:20 PM IST
Dil Raju Trying to Convince Vijay
X

Vaarasudu: విజయ్ ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్న దిల్ రాజు

Varasudu: ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమిళ్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న "వారసుడు" సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు థియేటర్ల విషయంలో కొన్ని వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగతి కూడా తెలిసిందే. అయితే మరోవైపు దిల్ రాజు విజయ్ కి ఈ సినిమా కోసం ఏకంగా 110 కోట్ల రెమ్యూనరేషన్ను ఇచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. అయితే విజయ్ చాలా వరకు తన సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటాడు.

తమిళ్లో కూడా సినిమా సక్సెస్ ఈవెంట్లలో తప్ప ప్రమోషన్లలో పెద్దగా కనిపించింది లేదు. కానీ విజయ్ మొట్టమొదటిసారిగా నటిస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా ఇది. ఈ నేపథ్యంలో విజయ్ కి తెలుగులో కొంత ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ సినిమా ప్రమోషన్స్ ముఖ్యమని దిల్ రాజు విజయ్ ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట. పైగా సంక్రాంతి సందర్భంగా చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మరియు బాలకృష్ణ "వీరసింహారెడ్డి" వంటి సినిమాలు కూడా లైన్లో ఉండడంతో తమ సినిమా ప్రమోషన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందని దిల్ రాజు విజయ్ ని హైదరాబాద్ లో సినిమా ప్రమోషన్స్ చేయమని కోరుతున్నారట.

గతంలో బీస్ట్ సినిమా సమయంలో విజయ్ ప్రమోషన్ల పేరుతో ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చారు తప్ప ఇప్పటిదాకా పెద్దగా ప్రమోషన్స్ చేసింది లేదు. మరి "వారసుడు" సినిమా కోసం విజయ్ ప్రమోషన్స్ లో పాల్గొంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. "మహర్షి" ఫేమ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story