దిల్‌ రాజు, తేజస్వీనిల ప్రేమ కథ.. 'పెన్' అడిగి..

దిల్‌ రాజు, తేజస్వీనిల ప్రేమ కథ.. 'పెన్' అడిగి..

Dhatripriya
Published on: 17 Jan 2023 2:47 PM IST
Dil Raju, Tejaswini Love Story
X

దిల్‌ రాజు, తేజస్వీనిల ప్రేమ కథ.. 'పెన్' అడిగి..

Tejaswini, Dil Raju Love Story: టాలీవుడ్ స్టార్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు. వారిద్దరికీ హన్సిత రెడ్డి అనే ఒక కూతురు కూడా ఉంది. అయితే తన భార్య చనిపోయిన మూడేళ్ల తర్వాత దిల్ రాజు మళ్ళీ తేజస్వీని అనే ఒక అమ్మాయిని 2020లో పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది 2022లో వీరిద్దరికి ఒక బాబు కూడా జన్మించాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దిల్ రాజు భార్య తమ ప్రేమ కథ గురించి చెప్పుకొచ్చింది.

నిజానికి ఆమె పీహెచ్‌డీ కోసం అమెరికాకి వెళ్లి పోదామని అనుకుందట. కానీ అదే సమయంలో ఆమెకు దిల్ రాజు పరిచయమయ్యారని ఆ తర్వాత అతనిని పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చారు తేజస్వీని. అంతకుముందు ఆమె ఒక ఎయిర్ లైన్స్ లో పనిచేస్తూ ఉండేదట. ఆ సమయంలో దిల్ రాజు తరచుగా ఆ ఎయిర్ లైన్స్ నుంచి ప్రయాణిస్తూ ఉండేవారట. ఒక సమయంలో దిల్ రాజు ఆమెను పెన్ అడిగారట. అలా వారిద్దరి పరిచయం మొదలైంది అని చెప్పుకొచ్చారు తేజస్విని.

"అలా నేను ఎప్పుడు షిఫ్ట్ లో ఉన్నా కూడా ఆయన అక్కడ ఉండేవారు," అని అన్నారు తేజస్విని. అయితే అది ఎలా జరిగింది అని యాంకర్ ప్రశ్నించగా దిల్ రాజు అది చాలా అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పుకొచ్చారు. ఇలా తమ ప్రేమ కథ ను దిల్ రాజు జంట బయటపెట్టారు. ఇక సినిమాల పరంగా ఈ మధ్యనే "వారసుడు" సినిమాని నిర్మించిన దిల్ రాజు పైప్ లైన్ లో మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story