Dil Raju: సంక్రాంతి బరిలో దిగనున్న దిల్ రాజు చిన్న సినిమా...

Dil Raju: ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి మొత్తం దిల్రాజు హడావిడి ఉండబోతుంది...

admin1
Updated on: 3 Jan 2022 2:20 PM IST
Dil Raju Small Movie Rowdy Boys Releasing on Sankranthi 2022 | Tollywood News
X

Dil Raju: సంక్రాంతి బరిలో దిగనున్న దిల్ రాజు చిన్న సినిమా...

Dil Raju: ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి మొత్తం దిల్రాజు హడావిడి ఉండబోతుంది. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న చాలా వరకు సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది దిల్ రాజ్. అయితే ఆర్ఆర్ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమాలు వాయిదా పడినప్పటికీ సంక్రాంతి ఇంకా దిల్ రాజు చేతుల్లోనే ఉంది. దానికి కారణం దిల్రాజు సోదరుడి కుమారుడు హీరోగా "రౌడీ బాయ్స్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రేమదేశం సినిమా రీమిక్స్ లాగా ఈ సినిమా ఉండబోతోందట ఈ చిత్రం. ఎప్పటినుంచో ఈ సినిమా విడుదల కోసం మంచి సమయం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే సంక్రాంతి కి "ఆర్ ఆర్ ఆర్", "రాధే శ్యామ్" వంటి భారీ బడ్జెట్ సినిమాలు లైన్ లో ఉండడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. కానీ ఇప్పుడు ఆ రెండు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోగా, నాగార్జున "బంగార్రాజు" సినిమా తప్ప సంక్రాంతికి పెద్ద సినిమాలే ఉండేలాగా కనిపించడం లేదు.

ఆఖరికి "భీమ్లా నాయక్" సినిమా కూడా వాయిదా పడింది. "ఆచార్య" కూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు లేదు. అందుకే ఇదే సరైన సమయం అని దిల్రాజు "రౌడీ బాయ్స్" సినిమాని సంక్రాంతి బరిలో దింపాలని అనుకుంటున్నారు. కాంపిటీషన్ కూడా ఏమీ ఉండదు కాబట్టి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందో లేదో చూడాలి.

admin1

admin1

Next Story