Dil Raju: మీ క్లిక్స్ కోసం మమ్మల్ని బలి పశువులను చేయొద్దు.. తెలియకపోతే మూసుకోండి..

మీ క్లిక్స్ కోసం మమ్మల్ని బలి పశువులను చెయ్యొద్దు అంటున్న దిల్ రాజు

Arun Chilukuri
Updated on: 16 Aug 2022 8:30 PM IST
Dil Raju Slams Media At Karthikeya 2 Success Meet
X

Dil Raju: మీ క్లిక్స్ కోసం మమ్మల్ని బలి పశువులను చేయొద్దు.. తెలియకపోతే మూసుకోండి..

Dil Raju: "కార్తికేయ 2" సినిమా విడుదలకి ముందు తన విడుదల తేదీ ను వాయిదా వేసుకోమని కొందరు నిర్మాతలు బెదిరించారని నిఖిల్ మీడియా ముందు మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. అయితే నిఖిల్ మాట్లాడింది దిల్ రాజు గురించేనని, తన సినిమాలను తప్ప మిగతా సినిమాలన్నీ దిల్ రాజు తొక్కేస్తూ ఉంటారని పుకార్లు మొదలయ్యాయి. తాజాగా "కార్తికేయ 2" సినిమా సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ వేడుకలో మాట్లాడుతూ దిల్ రాజు ఈ పుకార్లపై రియాక్ట్ అయ్యారు. నిజాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్లు రాతలు రాయొద్దు అంటూ మీడియాకి గట్టిగా చెప్పుకొచ్చారు. "వ్యూస్ కోసం క్లిక్స్ కోసం తప్పుడు రాతలు రాయకండి. నిజాలు తెలిస్తే మాత్రమే రాయండి లేకపోతే మూసుకోండి" అని దిల్ రాజు ఘాటుగా వ్యాఖ్యానించారు.

"సినిమాలను ఎవరు తొక్కరు. మేము సినిమాల కోసం కేవలం సలహాలు మాత్రమే ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము. నిఖిల్ తో నాకు హ్యాపీ డేస్ సినిమా నుంచి మంచి అనుబంధం ఉంది. ఇండస్ట్రీలో అందరు నిర్మాతల మధ్య హెల్తీ రిలేషన్స్ ఉంటాయి. కానీ మీ ఊహగానాల వల్లే ఇలాంటి వార్తలు బయటకు వచ్చాయి. మీ క్లిక్స్ కోసం మమ్మల్ని బలి పశువులను చేయొద్దు. నేను తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం నాకు ఉంది. కాబట్టి ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకున్నాక మాత్రమే రాయాలి, లేకపోతే మూసుకొని కూర్చోవాలి," అని మీడియా పై మండిపడ్డారు దిల్ రాజు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story