Vakeel Saab: పవన్ ఎంట్రీ కోసం అంతసేపు ఆగాల్సిందేనట!

Vakeel Saab: 'వకీల్ సాబ్' సినిమా రేపు (ఏప్రిల్ 9) భారీ అంచనాలతో విడుదల కానుంది.

Venkata Chari
Updated on: 8 April 2021 8:44 PM IST
Dil Raju Shares Pawan Kalyan’s Vakeel Saab Entry Scene
X
పవన్ కళ్యాణ్ (ఫొటో ట్విట్టర్)

Vakeel Saab: 'వకీల్ సాబ్' సినిమా రేపు (ఏప్రిల్ 9) భారీ అంచనాలతో విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ 3 ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ సినిమాపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వెండితెరపై పవర్ స్టార్ వెలుగులు చూద్దామా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ ఎంట్రీ కోసం కొద్దిసేపు ఆగాల్సిందేనని దిల్ రాజు అంటున్నారు.

రిలీజ్ సందర్భంగా నిర్మాత దిల్ రాజు కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వకీల్ సాబ్ సినిమా 15 నిమిషంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుందని ఆయన వెల్లడించారు. అక్కడ నుంచి స్టోరీలో భాగంగా ఎంట్రీ ఇస్తారని, పవన్ కళ్యాణ్‌ని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో.. దానికి ఏమాత్రం తగ్గకుండా వకీల్ సాబ్ ఉంటారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని దిల్ రాజు అన్నారు.

అయితే, ఎప్పుడెప్పుడా వెండి తెర మీద పవన్ కళ్యాణ్ ను చూద్దామనుకుంటున్న ఫ్యాన్స్ ఈ వార్త కొంచెం ఇబ్బందికరమే అయినా... మొత్తానికి పవన్ కళ్యాణ్ తెర మీద కనిపిస్తుండడంతో చాలా సంతోషంగా ఉన్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story