Dil Raju: సినిమా టిక్కెట్ల రేట్లు పెంచమని ప్రభుత్వాన్ని మేమే కోరాం

* ఎవరో చేసిన వ్యాఖ్యలకు ఇండస్ట్రీకి సంబంధం లేదన్న దిల్ రాజ్ * చర్చల సారాన్ని సినీ పరిశ్రమకు వివరించలేకపోయాం

Sandeep Reddy
Updated on: 29 Sept 2021 9:30 PM IST
Dil Raju Says We are the Only Requested to AP Government to Hike the Ticket Price
X

దిల్ రాజ్ (ఫైల్ ఫోటో)

Dil Raju: సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ చేయమని కోరినది తామేనని సినిమా ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు. సినిమా టిక్కెట్ల రేట్లు పెంచమని తామే కోరామని, గత సమావేశంలోనే దీనిపై చర్చించామని, మంత్రి పేర్నినాని దీనికి సానుకూలంగా స్పందించారని దిల్ రాజ్ అన్నారు.

అయితే ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చల సారాన్ని సినీ పరిశ్రమకు వివరించలేకపోయామని అందుకే ఈ పరిణామాలన్నీ తలెత్తాయని దిల్ రాజ్ అన్నారు. రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా విచారం వ్యక్తం చేశారని మంత్రి పేర్నినాని అన్నారు. ఆ వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని చిరంజీవి సహా, ఇతర నిర్మాతలు తెలిపారన్నారు.

సినిమా ఫంక్షన్ లో జరిగిన పొరపాటు వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని దిల్ రాజ్ కూడా కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీని వివాదాల్లోకి లాగొద్దని దిల్ రాజ్ వ్యాఖ్యానించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story