Dil Raju: "ఇకపై అలాంటి సినిమాలే ఎక్కువ చేస్తాను"

Dil Raju: ఒక రెండేళ్లు అలాంటి సినిమాలే చేస్తాను అంటున్న దిల్ రాజు

Dhatripriya
Updated on: 22 April 2023 9:31 PM IST
Dil Raju Says I Will Do More Such Films From Now
X

Dil Raju: "ఇకపై అలాంటి సినిమాలే ఎక్కువ చేస్తాను"

Dil Raju: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న "గేమ్ చేంజర్" సినిమా కి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో దిల్ రాజు పేరు కూడా ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్ లో మారు మ్రోగి పోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక ఇప్పటిదాకా దిల్ రాజు ప్రయాణం ఒకటి ఇకపై దిల్ రాజు ప్రయాణం మారుతుంది అని కొందరు చెబుతున్నారు. శంకర్ తో ఇప్పటిదాకా ఒక్క తెలుగు నిర్మాత కూడా సినిమాని నిర్మించలేదు.

దిల్ రాజు శంకర్ తో సినిమా తీస్తున్న మొట్టమొదటి తెలుగు నిర్మాత. శంకర్ తో సినిమా చేయటం ఒక కలగా భావించి మరీ దిల్ రాజు ఈ సినిమాలోకి దిగారు. ఇక ఈ సినిమా మొదలయ్యాక దిల్ రాజు లో కూడా భారీ మార్పులు వచ్చాయి అని మరికొందరు చెబుతున్నారు. నిజానికి దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాత కాదు. సినిమా మొదలైన తర్వాత ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. శంకర్ కారణంగానే దిల్ రాజు ఈ సినిమాని టేకప్ చేశారు. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దిల్ రాజు తన ప్లానింగ్ గురించి చెప్పుకొచ్చారు.

ఒక రెండేళ్ల పాటు గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ ఉండే సినిమాలు చేయాలని తాను నిర్ణయించుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. టెక్నికల్ సినిమాల మీద నాలెడ్జ్ చాలా అవసరం అని ఈ విధంగా తాను తన కెరియర్ లో ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టినట్లుగా చెప్పుకొచ్చారు. 2025 వరకు కేవలం గ్రాఫిక్స్ సినిమాలు మాత్రమే ఎక్కువగా నిర్మిస్తానని అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story