Dil Raju: శతమానం భవతి కోసం స్టార్ డైరెక్టర్ ని నటుడిగా మారమని కోరిన దిల్ రాజు

Dil Raju: శతమానం భవతి కోసం స్టార్ డైరెక్టర్ ని నటుడిగా మారమని కోరిన దిల్ రాజు

admin1
Published on: 12 Oct 2021 6:11 PM IST
Dil Raju:  శతమానం భవతి కోసం స్టార్ డైరెక్టర్ ని నటుడిగా మారమని కోరిన దిల్ రాజు
X
దిల్ రాజు & రాఘవేంద్ర రావు (ఫైల్ ఇమేజ్)

Dil Raju: దర్శకుడిగా బోలెడు బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన రాఘవేంద్రరావు ఇప్పుడు "పెళ్లి సందడి" సినిమా తో నటుడిగా కూడా పరిచయం కాబోతున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "పెళ్లిసందడి" సినిమా లో రాఘవేంద్రరావు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొన్ని ఆసక్తికరమైన కామెంట్లను చేశారు.

"నిజానికి "శతమానం భవతి" సినిమా లో శర్వానంద్ తాతగారి పాత్ర కోసం ముందుగా రాఘవేంద్రరావు అనుకున్నాము. స్క్రిప్టు కూడా నెరెట్ చేసేసాము కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆ రోల్ ప్రకాష్ రాజు గారు చేశారు," అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. దీని గురించి రియాక్ట్ అవుతూ రాఘవేంద్ర రావు ఇలా అన్నారు. "పదేళ్ల క్రితం వెంకటేష్ కూడా ఒక నటించే ఆఫర్ ఇచ్చారు. కానీ ఆ పాత్ర నేను చేయలేనెమోనని సున్నితంగా తిరస్కరించాను. వెంకటేష్ తర్వాత మళ్లీ "శతమానంభవతి" కోసం దిల్ రాజు కూడా అడిగారు. అప్పుడు దిల్ రాజు సినిమాలో నేను నటించ లేకపోయాను కాబట్టి నా పాత్ర ఇంట్రోని దిల్ రాజు తో విడుదల చేయించటం జరిగింది," అని చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు.

admin1

admin1

Next Story