Dil Raju: ఆ ఇద్దరితో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలలో "లవ్ టుడే" కూడా ఒకటి.

Arun Chilukuri
Published on: 29 Nov 2022 2:36 PM IST
Dil Raju Planning A Multistarrer With Pradeep Ranganathan and Vijay Deverakonda
X

Dil Raju: ఆ ఇద్దరితో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలలో "లవ్ టుడే" కూడా ఒకటి. "కోమలి" సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ రంగనాథన్ తాజాగా ఇప్పుడు హీరోగా కూడా నటించి "లవ్ టుడే" సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ సినిమాలో ఇవానా హీరోయిన్ గా నటించగా, సత్య రాజ్ రాధికా శరత్ కుమార్లు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయింది.

ఇక ఈ మధ్యనే ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలై మంచి వసూళ్లను నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్ పై టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగానే క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రదీప్ తో ఒక సినిమా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. వరుసగా "కోమలి", "లవ్ టుడే" సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న ప్రదీప్ రంగనాథన్ తో ఒక డైరెక్టర్ తెలుగు సినిమా చేయించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

అయితే అంతేకాకుండా యువ హీరో విజయ్ దేవరకొండ తో కూడా దిల్ రాజు ఎప్పటినుంచో సినిమా చేయాలని అనుకుంటున్నారు. కానీ కుదరటం లేదు. ఈ నేపథ్యంలో దిల్ రాజు విజయ్ దేవరకొండ మరియు ప్రదీప్ రంగనాథన్ లతో ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి. మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివనిర్వణా దర్శకత్వంలో "ఖుషి" అనే సినిమాతో బిజీగా ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story