రెండు పెద్ద సినిమాల రైట్ లను సొంతం చేసుకున్న దిల్ రాజు

Dil Raju Owns the Rights to Two Big Movies | Telugu News
x

రెండు పెద్ద సినిమాల రైట్ లను సొంతం చేసుకున్న దిల్ రాజు

Highlights

*రెండు పెద్ద సినిమాల రైట్ లను సొంతం చేసుకున్న దిల్ రాజు

Dil Raju: ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అయినా డిస్ట్రిబ్యూటర్ అన్నా ముందుగా గుర్తొచ్చే పేరు దిల్ రాజు. ముఖ్యంగా ఎలాంటి సినిమా అయినా ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసే నైజాం ఏరియా కి దిల్ రాజు కింగ్ లాంటి వారు. దాదాపు నైజాం ఏరియా మొత్తం దిల్ రాజు చేతుల్లోనే ఉంటుంది. తాజాగా ఈ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు మరొక రెండు పెద్ద సినిమాలను లైన్ లో పెట్టారు దిల్ రాజు.

అందులో ఒకటి మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమా కాగా మరొకటి న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న "అంటే సుందరానికి". పరశురాం దర్శకత్వం వహించిన "సర్కారు వారి పాట" సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ సినిమా మేలో విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు "బ్రోచేవారెవరురా" ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న "అంటే సుందరానికి" సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా ఒక కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతోందని చిత్ర బృందం ఈ సినిమా జూన్ 22న విడుదల అవుతుందని అధికారిక విడుదల తేదీని కూడా ప్రకటించింది. అయితే ఈ రెండు సినిమాలను దిల్ రాజు 48 కోట్లు పెట్టి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాలు కలిపి దిల్ రాజు ఈ సారి ఎంత ప్రాఫిట్ లు అందుకుంటారు ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories