దిల్ రాజు క్యాంపులో కేజీఎఫ్ స్టార్

Dil Raju Move with KGF Star Yash
x

దిల్ రాజు క్యాంపులో కేజీఎఫ్ స్టార్

Highlights

KGF Star Yash: ఒకవైపు బాలీవుడ్ నిర్మాతలు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చుట్టూ తిరుగుతుంటే...

KGF Star Yash: ఒకవైపు బాలీవుడ్ నిర్మాతలు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చుట్టూ తిరుగుతుంటే టాలీవుడ్ నిర్మాతలు మాత్రం ఇతర భాషల స్టార్ హీరోల వెనకాల తిరుగుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ విజయ్ తెలుగులో తన మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా చేసేందుకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ధనుష్ కూడా డైరెక్ట్ తెలుగు సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విజయ్ సినిమా మరియు రామ్ చరణ-శంకర్ ల సినిమాలతో బిజీగా ఉన్న దిల్ రాజు బాలీవుడ్ లో కూడా జెర్సీ మరియు హిట్ రీమేక్ సినిమాలను తో బిజీగా ఉన్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ ని టాలీవుడ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శాండల్ వుడ్ లో రాకింగ్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న యశ్ "కే జి ఎఫ్" సినిమా తో ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు. తెలుగులో కూడా యశ్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. "కే జి ఎఫ్ 2" సినిమా తర్వాత కొన్ని కన్నడ సినిమాలు చేయబోతున్నారు యశ్.

అయితే తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు ఈ మధ్యనే యశ్ ను కలిసి సినిమాకి సంబంధించిన డిస్కషన్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక యశ్ కూడా తెలుగులో డైరెక్ట్ సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తెలుగు, కన్నడ లో మాత్రమే కాక హిందీ, తమిళ్లో కూడా విడుదల కాబోతుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories