'ఎఫ్‌3' టికెట్‌ రేట్లపై దిల్‌రాజు కీలక ప్రకటన

Dil Raju Makes Announcement On F3 Ticket Rates
x

‘ఎఫ్‌3’ టికెట్‌ రేట్లపై దిల్‌రాజు కీలక ప్రకటన

Highlights

Dil Raju: టాలీవుడ్ ఇండస్టీలో అంతర్మధనం మొదలైనట్టు కనిపిస్తోంది.

Dil Raju: టాలీవుడ్ ఇండస్టీలో అంతర్మధనం మొదలైనట్టు కనిపిస్తోంది. పెరిగిన టికెట్ రేట్ల ప్రభావం ఆచార్య, గని, సర్కారు వారి పాట సినిమాలపై పడగా.. రాబోతున్న సినిమాల విషయంలో నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పెంచిన టికెట్ ధరలతో ఆడియన్స్ పై భారం పడుతుందని భావించి టికెట్ రేట్ల పెంపుదల విషయంలో వెనకడుగు వేస్తున్నారు.

ఇప్పటికే ఎఫ్ 3 టికెట్ ధరలు పెంచడం లేదని నిర్మాత దిల్ రాజు ప్రకటించగా అదే బాటలో శేఖర్ చిత్ర యూనిట్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. బుధవారం ఉదయం చిత్ర నిర్మాత దిల్‌రాజు ఓ ప్రకటన చేశారు. ''ఎఫ్‌-3' చిత్రానికి టికెట్‌ రేట్లు పెంచడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మేము ఈ చిత్రాన్ని మీ ముందుకు తెస్తున్నాం'' అని స్పష్టత ఇచ్చారు. దిల్‌రాజు ప్రకటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎంతో ఆనందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories