Dil Raju: #ఆర్సీ15 గురించి షాకింగ్ కామెంట్లు చేసిన దిల్ రాజు

*రామ్ చరణ్ బదులు ముందుగా పవన్ కళ్యాణ్ ను అనుకున్నారట

Jyothi
Published on: 7 April 2023 3:03 PM IST
Dil Raju Made Shocking Comments About #RC15
X

Dil Raju: #ఆర్సీ15 గురించి షాకింగ్ కామెంట్లు చేసిన దిల్ రాజు

Dil Raju: "ఆర్ఆర్ఆర్" సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగానే పెరిగిపోయింది. ఇక ఈ మధ్యనే "నాటు నాటు" పాటకి వచ్చిన ఆస్కార్ తో చెర్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

తన కెరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకి "గేమ్ చేంజర్" అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు దర్శకనిర్మాతలు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దిల్ రాజు ఈ సినిమా గురించి ఈ షాకింగ్ కామెంట్లు చేశారు. "శంకర్ గారు నాకు గేమ్ చేంజెర్ కథను 45 నిమిషాల పాటు నేరేట్ చేశారు.

ముందు ఆయన పవన్ కళ్యాణ్ ని హీరోగా పెట్టుకోవాలని అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి కంటే ఈ కథ రామ్ చరణ్ కి బాగా సూట్ అవుతుందని నేనే చెప్పాను అందుకే ఈ సినిమా ఇప్పుడు రామ్ చరణ్ చేతుల్లోకి వచ్చింది," అని అంటున్నారు దిల్ రాజు. ఇక రామ్ చరణ్ బదులు తన బాబాయి పవన్ కళ్యాణ్ ఈ సినిమా లో హీరో అయి ఉంటే ఎలా ఉండేదో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Jyothi

Jyothi

Next Story