"థాంక్యూ" బడ్జెట్ విషయంలో నిర్మాత కంగారు

Dil Raju is Worrying About Naga Chaitanya’s Thank You
x

"థాంక్యూ" బడ్జెట్ విషయంలో నిర్మాత కంగారు

Highlights

Naga Chaitanya: యువ హీరో నాగచైతన్య ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

Naga Chaitanya: యువ హీరో నాగచైతన్య ఈ మధ్యనే "బంగార్రాజు" సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగ చైతన్య "థాంక్యూ" సినిమాతో బిజీగా ఉన్నారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జులై 22 న థియేటర్ లలో విడుదల కాబోతోంది.

అయితే తాజా సమచారం ప్రకారం ఈ సినిమాకి అయిన బడ్జెట్ విషయంలో నిర్మాత దిల్ రాజు కంగారు పడుతున్నారు అని తెలుస్తోంది. దానికి కారణం ఈ సినిమా బడ్జెట్ బాగా పెరిగిపోవడం అని తెలుస్తోంది. నిజానికి ఫారిన్ లొకేషన్స్ లో జరిగిన షూటింగ్ కి సంబంధించిన విజువల్స్ కొన్ని మిస్ అయ్యయట. దీంతో ఆ సన్నివేశాలను మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది. నిజానికి ఇలాంటివి జరగడం చాలా కామన్ విషయం కానీ దీనివల్ల బడ్జెట్ బాగా పెరిగిపోయిందట.

అయితే సినిమా ఔట్ పుట్ బాగా రావడంకోసం దిల్ రాజు కూడా రీషూట్ కి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యింది. అందుకే ఆ బడ్జెట్ ని మళ్లీ తిరిగి రాబట్టడం ఎలా అని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా బడ్జెట్ ను రికవర్ చేయగలదా లేదా చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories