"బింబిసార 2" కోసం రంగంలోకి దిగనున్న దిల్ రాజు

Dil Raju: "బింబిసార 2" కోసం రంగంలోకి దిగనున్న దిల్ రాజు

Jyothi
Updated on: 17 Aug 2022 1:41 PM IST
Dil Raju is Showing Interest in Kalyan Ram Movie
X

కళ్యాణ్ రామ్ సినిమాపై ఆసక్తి చూపిస్తున్న దిల్ రాజు

Dil Raju: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "బింబిసార" సినిమా ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మల్లిడి వశిస్ట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2 పై ఉంది. "బింబిసార 2" గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి "బింబిసార" బ‌డ్జెట్ కొంతవరకే ప‌రిమిత‌మయ్యింది. కానీ ఇప్పుడు వ‌శిష్ట్ పై నమ్మకం బాగా కుదరడంతో "బింబిసార 2" కు భారీ బడ్జెట్ పెట్టడానికి క‌ల్యాణ్ రామ్ రెడీ అంటున్నట్టు సమాచారం.

అయితే ఈ ప్రాజెక్టులో ఇప్పుడు దిల్ రాజు కూడా ఎంట‌ర్ అవ్వ‌బోతున్న‌ట్టు టాక్‌ వినిపిస్తోంది. "బింబిసార" సినిమా ప‌రిమిత బ‌డ్జెట్ తో అయినప్పటికీ మంచి క్వాలిటీ తో రావడంతో దిల్ రాజు కూడా సీక్వెల్ పై ఆసక్తి చూపిస్తున్నారట. బ‌డ్జెట్ పెరిగితే "బింబిసార 2" ని మ‌రో స్థాయిలో తీస్తార‌న్న న‌మ్మ‌కం దిల్ రాజు కి క‌లిగింది.

బింబిసార స‌క్సెస్ మీట్ లో మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు వశిష్ట్ ను దిల్ రాజు ఆకాశానికి ఎత్తేసిన విష‌యం తెలిసిందే. ఈ సంవత్సరం అస‌లు సిస‌లైన హిట్ ఇదేన‌ని దిల్ రాజు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే సినిమా నిర్మాణంలో కూడా చేయి క‌ల‌ప‌డానికి దిల్ రాజు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Jyothi

Jyothi

Next Story