Dil Raju: భారీ కాంబినేషన్లతో సినిమాలు ప్లాన్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: నాలుగైదు సంవత్సరాల పాటు భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ కాబోతున్న స్టార్ నిర్మాత..

Jyothi
Published on: 14 April 2023 10:25 AM IST
Dil Raju is Planning Movies with Huge Combinations
X

Dil Raju: భారీ కాంబినేషన్లతో సినిమాలు ప్లాన్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక సినిమాలో కథని ఎక్కువగా నమ్ముతారు కానీ కాంబినేషన్స్ ని భారీ బడ్జెట్ సెటప్పులని పెద్దగా పట్టించుకోరు. కానీ తాజాగా ఇప్పుడు దిల్ రాజు కూడా తన వైఖరి మారుస్తూ కాంబినేషన్స్ మీద దృష్టి పెడుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన "వారసుడు" సినిమాతో ప్రారంభించిన దిల్ రాజు శంకర్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో "గేమ్ చేంజర్" సినిమా విషయంలో కూడా అదే ఫాలో అయ్యారు. తాజాగా ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో కూడా మళ్లీ అదే స్ట్రాటజీ వాడుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ మధ్యనే "వాల్తేరు వీరయ్య" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబి మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్లో సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యారు దిల్ రాజు. అంతేకాకుండా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు ఆయన మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో కూడా ఒక సినిమా ఈ ఏడాదే పట్టాలెక్కనుంది అని ఆ సినిమాని కూడా దిల్ రాజు నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక రామ్ చరణ్ మరియు ప్రభాస్ వంటి స్టార్ హీరోల తో కూడా సినిమాలు వెనకేసిన దిల్ రాజు ఇద్దరు హీరోల కోసం సుకుమార్ మరియు ప్రశాంత్ నీల్ లను డైరెక్టర్లుగా ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. చూస్తూ ఉంటే రానున్న నాలుగైదు సంవత్సరాల పాటు దిల్ రాజు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అలా అని చిన్న బడ్జెట్ సినిమాలకి దూరంగా ఉండకుండా "బలగం" వంటి సూపర్ హిట్ సినిమాలను కూడా అందిస్తున్నారు దిల్ రాజు.

Jyothi

Jyothi

Next Story