తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ్ ప్రేక్షకులను కూడా ఇరిటేట్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju is Irritating Telugu Audience as Well as Tamil Audience
x

తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ్ ప్రేక్షకులను కూడా ఇరిటేట్ చేస్తున్న దిల్ రాజు

Highlights

Dil Raju: అజిత్ అభిమానుల కు చిరాకు తెప్పిస్తున్న దిల్ రాజు

Dil Raju: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజుకి బాగానే పేరు ఉంది. తాజాగా ఇప్పుడు దిల్ రాజు ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తున్న మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా వారసుడుని నిర్మించారు. వంశి పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. అయితే అదే సమయంలో చిరంజీవి "వాల్తేరు వీరయ్య" మరియు బాలకృష్ణ "వీరసింహారెడ్డి" సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.

ఈ రెండు సినిమాలను కాదని దిల్ రాజు "వారసుడు" సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారు అని ఇప్పటికే తెలుగు అభిమానులు దిల్ రాజు పై మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దిల్ రాజు అన్న ఒక మాట ఇప్పుడు తమిళ్ ప్రేక్షకులను కూడా దిల్ రాజుకి యాంటీ గా మార్చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోలీవుడ్ లో కూడా విజయ్ నంబర్ 1 హీరో అని కచ్చితంగా తన సినిమాకి ఎక్కువ థియేటర్లు దక్కి తీరాలని అనడంతో అజిత్ అభిమానులు హర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో దిల్ రాజుని సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేశారు.

ఇదిలా ఉండగా మరోవైపు వారసుడు ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ దిల్ రాజు ఈసారి సంక్రాంతి ఈ సంక్రాంతి మాదే అంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు అభిమానులకు మరింత చిరాకు తెప్పిస్తున్నాయి. ఒకవైపు తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక మరోవైపు తమిళ్ ప్రేక్షకులు కూడా ఇప్పుడు దిల్ రాజుకి యాంటీ గా మారిపోయి దిల్ రాజు పై సోషల్ మీడియా ద్వారా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక అజిత్ "తునీవు" సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా నే విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories