Dil Raju: తెలంగాణలో భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: *"ఆర్ఆర్ఆర్" విషయంలో తెలంగాణ పైన ఆశలు పెట్టుకున్న దిల్ రాజు

admin1
Published on: 20 March 2022 1:16 PM IST
Dil Raju is Demanding a Huge Amount in Telangana
X

Dil Raju: తెలంగాణలో భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: భారీ అంచనాల మద్య ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చి 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం

ఈ చిత్ర బెనిఫిట్ షో ల కోసం దిల్ రాజు భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా బెనిఫిట్ షో లను మరియు పెయిడ్ ప్రీమియర్స్ ను కూడా నిర్వహించాలని దర్శక నిర్మాతలు ముందుగానే నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో దిల్ రాజు బెనిఫిట్ షో ల కోసం భారీ మొత్తాన్ని అడుగుతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉదయం 6:00 షో ల కోసం దిల్ రాజు ఏకంగా 1.2 కోట్లు అడుగుతున్నారట.

ఇక ఖమ్మంలో కూడా అ 60 లక్షల దాకా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం టికెట్ రేట్లు భారీగా పెంచటానికి లేదు. టికెట్ పై కేవలం 75 రూపాయల పెంచడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి తెలంగాణలోనే సినిమా నుంచి మంచి కలెక్షన్లు రాబట్టాలని దిల్ రాజు ఇలా చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.

admin1

admin1

Next Story