ఆ రెండు సినిమాల పైనే ఆశలన్నీ పెట్టుకున్న దిల్ రాజు

Dil Raju: ఈమధ్య కాలంలో నిర్మాత దిల్ రాజు టైం ఏ మాత్రం బాగోటం లేదు.

Arun Chilukuri
Updated on: 29 July 2022 8:15 PM IST
Dil Raju has Pinned all his Hopes on Those two Films
X

ఆ రెండు సినిమాల పైనే ఆశలన్నీ పెట్టుకున్న దిల్ రాజు

Dil Raju: ఈమధ్య కాలంలో నిర్మాత దిల్ రాజు టైం ఏ మాత్రం బాగోటం లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఒకప్పుడు డబుల్ హ్యాట్రిక్ అందుకున్న దిల్ రాజు ఇప్పుడు వరుసగా డిజాస్టర్ లను చవిచూస్తున్నారు. "ఎఫ్2" సినిమా తర్వాత దిల్ రాజు నిర్మించిన ఇద్దరి లోకం ఒకటే, జాను, వి వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి.

"వకీల్ సాబ్" సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం బ్రేక్ ఈవెన్ పాయింట్ ని సైతం చేరుకోలేకపోయింది. ఆ తర్వాత షాదీ ముబారక్, రౌడీ బాయ్స్ వంటి చిన్న సినిమాలు చేశారు కానీ వాటితో కూడా మంచి విజయాన్ని సాధించలేకపోయారు. "ఎఫ్ త్రీ" సినిమాతో సైతం కొంత మేర నష్టాలు చవిచూసిన దిల్ రాజు హిందీలో జెర్సీ సినిమా రీమేక్ తో మరొక ఫెయిల్యూర్ ని అందుకున్నారు. ఇక తాజాగా ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పుడు రాబోయే రెండు సినిమాల పైన మాత్రమే తన ఆశలన్నీ పెట్టుకున్నారు.

అందులో మొదటిది కోలీవుడ్ స్టార్ విజయ్ చేస్తున్న మొట్టమొదటి తెలుగు సినిమా "వారసుడు". వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న #ఆర్సీ15 కూడా ప్యాన్ ఇండియన్ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం దిల్ రాజు దాదాపు 200 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story