Dil Raju: బోలెడు భారీ బడ్జెట్ ప్రాజెక్టులు లైన్ లో పెట్టిన దిల్ రాజు

Dil Raju: దిల్ రాజు లైన్ అప్ లో భారీ బడ్జెట్ సినిమాలు..

Jyothi
Updated on: 30 April 2023 8:00 PM IST
Dil Raju has lined up Many Big-Budget Projects
X

Dil Raju: బోలెడు భారీ బడ్జెట్ ప్రాజెక్టులు లైన్ లో పెట్టిన దిల్ రాజు

Dil Raju: ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నిర్మాతలలో దిల్ రాజు పేరు ముందే ఉంటుంది. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాక చిన్న బడ్జెట్ సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకుంటున్న దిల్ రాజు ఈ మధ్యనే సమంత నటించిన "శాకుంతలం" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్నారు. తన 25 ఏళ్ల కరియర్లో చూసిన భారీ డిజాస్టర్ ఇదేనని దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దిల్ రాజు చేతిలో బోలెడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అన్ని భారీ అంచనాలు ఉన్న సినిమాలే.

దిల్ రాజు భారీ లైన్ అప్ లో ఉన్న మొదటి సినిమా "గేమ్ చేంజర్". మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాని కూడా నిర్మిస్తున్నారు దిల్ రాజు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" సినిమా తర్వాత ప్రభాస్ మరొక సినిమా సైన్ చేశారు. ఆ సినిమాని కూడా దిల్ రాజే నిర్మిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ఫ్లాప్లేస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాకి కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ తో దిల్ రాజు మరొక సినిమా చేయాల్సి ఉంది. "హిట్" ఫ్రాంచైజ్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో "విశ్వంభరా" సినిమా కానీ లేక ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో "జటాయు" సినిమా కానీ దిల్ రాజు చేతిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా దిల్ రాజు లైన్ అప్ లో మంచి భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి.

Jyothi

Jyothi

Next Story