రామ్ చరణ్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు

*రామ్ చరణ్ - శంకర్ సినిమా టైటిల్ అప్పుడేనా?

Jyothi
Published on: 9 March 2023 11:33 AM IST
Dil Raju Gave an Update About Ram Charan Movie
X

రామ్ చరణ్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు

Dil Raju: "ఆర్ఆర్ఆర్" సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #ఆర్సీ15 అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే వస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు విభిన్న లుక్స్ తో కనిపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. "వినయ విధేయ రామ" సినిమా తర్వాత వీరిద్దరి కాంబో లో వస్తున్న రెండవ ఇది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ముందుగా సినిమాకి సంబంధించిన టైటిల్ మరియు విడుదల తేదీ గురించి మాట్లాడుతూ త్వరలోనే వీటికి సంబంధించిన ప్రకటన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు.

డైరెక్టర్ శంకర్ ఆ పని మీదే ఉన్నారు అని అన్న దిల్ రాజు సినిమా సినిమాని వచ్చేయడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలన్నదే తమ ప్రయత్నమని అన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అంజలి, సునీల్ జయరాం, శ్రీకాంత్, నవీన్ చంద్ర, నాజర్, తదితరులు ముఖ్యపాత్రులు పోషిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు మరియు డైరెక్టర్ ఎస్. జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.

Jyothi

Jyothi

Next Story