Dil Raju Viral Video: థియేటర్లో దిల్ రాజు సందడి; పవన్ ఎంట్రీ ఇవ్వగానే ఏం చేశాడో తెలుసా...

Dil Raju: 'దిల్ రాజు'.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నైజాం డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా మారాడు.

Venkata Chari
Published on: 9 April 2021 12:09 PM IST
Dil Raju Enjoyed in Theater With Wife
X

థియేటర్లో దిల్ రాజు సందడి (ఫొటో ట్విట్టర్)

Dil Raju: 'దిల్ రాజు'.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నైజాం డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా మారాడు. నిర్మాతకు సెలబ్రిటీ స్టేటస్ తీసుకొచ్చింది ఆయనే. దిల్ రాజు సినిమా వస్తుందంటే ఖచ్చితంగా హిట్ అవుతుందనేది జనాల్లో పాతుకుపోయింది. జనాల్లోనే కాదు డిస్టిబ్యూటర్లకు అంతే నమ్మకం. ఆయన ఎంచుకునే సినిమాలు అలా ఉంటాయన్నమాట. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. కానీ, తాను అభిమానించే పవన్ కల్యాణ్ తో మాత్రం సినిమా చేయలేదు. ఆ కోరిక వకీల్ సాబ్ తో తీరింది. ఇదే విషయం పవన్ కళ్యాణ్ కూడా వెల్లడించాడు.

ఈ రోజు రిలీజైన వకీల్ సాబ్ సినిమాను తన భార్యతో కలిసి దిల్ రాజు హాజరయ్యారు. పవన్ ఎంట్రీ సీన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాడు. తెర మీద కనిపించిన వెంటనే ఉత్సహాంతో చేతిలోని పేపర్లను తెర మీదకు విసిరేశారు. ఫ్యాన్స్ తో కలిసిపోయి మరీ సందడి చేశాడు. ఈ మేరకు ఓ వీడియో వైరల్ గా మారింది. పవన్ మీద దిల్ రాజుకు ఉన్న అభిమానం ఎంతన్నది ఈ వీడియో చేస్తే అర్థమవుతుంది.


Venkata Chari

Venkata Chari

Next Story