నా సక్సెస్ కు కారణం ఆమె అంటూ ఎమోషనల్ అయిన దిల్ రాజు..

Dil Raju: అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా థాంక్యూ.

Arun Chilukuri
Published on: 17 July 2022 2:35 PM IST
Dil Raju Emotional Speech at Thank You Pre-release Event
X

నా సక్సెస్ కు కారణం ఆమె అంటూ ఎమోషనల్ అయిన దిల్ రాజు..

Dil Raju: అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా థాంక్యూ. ఈ సినిమా జులై 22న రిలీజ్ కాబోతుంది. శనివారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి ఈ రోజున ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. సినిమాల్లోకి రావడానికి ముందు తాను చేసిన వ్యాపారాలను గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో తనకి సహకరించిన వారెవరినీ తాను మరిచిపోలేదని చెప్పారు. ఈ వేదిక ద్వారా కూడా వాళ్లకి థ్యాంక్స్ చెప్పవలసిన బాధ్యత తనకి ఉందని అన్నారు.

ఇంత దూరం వ‌చ్చానంటే ఇది నా ఒక్క‌డి వ‌ల్ల‌నే కాలేదు. ఎంతో మంది స‌పోర్ట్ చేశారని అన్నారు. అందులో ముందుగా అమ్మ నాన్న‌కి థాంక్స్. ఎందుకంటే జ‌న్మ‌ను ఇవ్వ‌ట‌మే కాదు మంచి చెడులు చెప్పించి మంచి వ్య‌క్తిని తీర్చిదిద్దారని అన్నారు. తన ప్రయాణంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయనీ అలాగే సక్సెస్ లు ఉన్నాయని చెప్పారు. డిస్ట్రి బ్యూటర్ గా ఉన్నప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో చాలా ఇబ్బందులు కష్టాలు పడ్డానని అన్నారు.

కష్టాలు ఎదురైనప్పుడు ఓపికతో మనలను ముందుకు నడిపించేది భార్య మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో నా భార్య 'అనిత' నాకు అండగా నిలిచింది. 27 సంవత్సరాల మా జర్నీలో ఎన్నో ఇబ్బందులను దాటుకుని నేను ముందుకు వెళ్లడానికి తాను కారణమైంది. ఈ సందర్భంగా ఆమెకి థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. ఆ తరువాత తనని తాను కంట్రోల్ చేసుకుంటూ .. 'దిల్' సినిమాతో తనకి హిట్ ఇచ్చిన వీవీ వినాయక్ గారిని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. నిర్మాతగా తన కెరియర్లో 50 సినిమాలను పూర్తి చేశాననీ అందుకు సంబంధించిన ప్రతి ఒక్కరికీ తాను థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story