'మహర్షి' వాయిదా పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

Ruthvik
Published on: 7 March 2019 4:28 PM IST
మహర్షి వాయిదా పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'మహర్షి'. మహేష్ బాబు 25 సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25 వ తారీకు న విడుదల కావలసి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా మే 9వ తారీఖున విడుదలకు సిద్దం అవుతుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయంపై ఇప్పటికే చాలా వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఈ మధ్యనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

ఇవాళ ప్రెస్మీట్లో 'మహర్షి' సినిమా గురించి మాట్లాడుతూ అమెరికా షెడ్యూల్ కోసం వెళ్లాలి అనుకున్నప్పుడు వీసా ప్రాసెసింగ్ వల్ల నెల రోజులు షూటింగ్ ఆలస్యం అయిందని ఆలస్యమైందని అందుకే సినిమా విడుదల కూడా వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి కావచ్చిందని, ఏప్రిల్ 12 తో షూటింగ్ పూర్తవుతుందని , ఆఖరి షెడ్యుల్ అబుదాబి లో జరగనుంది అని కూడా చెప్పారు దిల్ రాజు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

Ruthvik

Ruthvik

Next Story