రామ్ చరణ్ - శంకర్ సినిమా నుంచి వాక్ అవుట్ చేసిన టెక్నీషియన్.. కారణం అదేనా?

Dil Raju Brings New Problem To Ram Charan
x

రామ్ చరణ్ - శంకర్ సినిమా నుంచి వాక్ అవుట్ చేసిన టెక్నీషియన్.. కారణం అదేనా?

Highlights

Ram Charan: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు.

Ram Charan: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు. ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు రామ్ చరణ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది కానీ కొన్ని కారణాలవల్ల సినిమా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి.

అయితే తాజాగా డైరెక్టర్ శంకర్ ఇప్పుడు కమల్ హాసన్ తో చేయాల్సిన "భారతీయుడు 2" సినిమాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి రామ్ చరణ్ సినిమాని పక్కకి పెట్టేయడం తో అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం శంకర్ "భారతీయుడు 2" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తో సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఇంకా క్లారిటీ లేదు.

మరోవైపు సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేయాల్సిన మౌనిక మరియు రామకృష్ణ కూడా క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత రవీందర్ రెడ్డి అనే ఒక ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ రంగంలోకి దింపారు. కానీ ఆయనకి మరియు చిత్ర నిర్మాత దిల్ రాజుకి మధ్య ఒక సెట్ విషయంలో జరిగిన వాగ్వాదం వల్ల ఆయన కూడా సినిమా నుంచి తప్పుకున్నారు. మరి ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories