Dil Raju: శాకుంతలం మిస్ ఫైర్ అయింది.. నా పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం..

Dil Raju: శాకుంతలం మిస్ ఫైర్ అయింది.. నా పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం..

Arun Chilukuri
Published on: 28 April 2023 3:42 PM IST
Dil Raju Accept Shaakuntalam Failure, Says Biggest one in Career
X

Dil Raju: శాకుంతలం మిస్ ఫైర్ అయింది.. నా పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం..

Dil Raju: స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన "శాకుంతలం" సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైంది. కానీ విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేమ కథకి అసలు ప్రేక్షకులు ఏమాత్రం కనెక్ట్ అవ్వలేకపోయారని, విజువల్ ఎఫెక్ట్స్ చాలా కామెడీగా ఉన్నాయి అని, అల్లు అర్హ కామియో తప్ప సినిమాలో పెద్ద చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ లు కూడా ఏమీ లేవని చాలామంది ఈ సినిమా మీద కామెంట్లు చేశారు.

తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్‌పై ఓ ఇంటర్వ్యూలో నిర్మాత దిల్‌ రాజు స్పందించారు. తన పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం అని అన్నారు. శాకుంతలం మూవీ మిస్‌ ఫైర్ అయింది.. సోమవారం, మంగళవారానికే కలెక్షన్లు లేవంటే ఫలితం ఏమిటో తమకు అర్థమైపోయిందని చెప్పారు. ఇంకా కలెక్షన్లు వస్తాయేమో అనే భ్రమల్లో ఉండటం వేస్ట్ అన్నారు. ఇటీవలే బలగం, దసరా సినిమాలతో హిట్ అందుకున్న దిల్‌ రాజుకు శాకుంతలం షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story