"మా"లో తప్పని విభేదాలు..!? మంచుకి మెగాస్టార్ "నో"..??

మాలో తప్పని విభేదాలు..!? మంచుకి మెగాస్టార్ నో..??
x

చిరంజీవి మోహన్ బాబు (ఫైల్ ఇమేజ్)

Highlights

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. "మా" ఎన్నికలు జరగడానికి మరో మూడు నెలలు సమయం ఉన్నా ఇండస్ట్రీ లోని కొందరు ప్రముఖ నటినటులు తాము బరిలో నిలబడబోతున్నాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. మొదట నటుడు ప్రకాష్ రాజ్ రాబోయే ఎన్నికల్లో మా అధ్యక్ష పదవికి పోటి చేయడంతో పాటు తన ప్యానల్ లోని సభ్యులని కూడా మీడియా ముందు ప్రకటన చేసాడు. మరోవైపు మంచు విష్ణు కూడా మీడియా ముఖంగా ఈసారి మా బరిలో ఉంటున్నట్లు తెలిపాడు. మరోవైపు జీవిత రాజశేఖర్, హేమతో పాటు తాజాగా న్యాయవాది మరియు నటుడు అయిన సీవిఎల్ నర్సింగరావు కూడా ఈ ఎన్నికల్లో పోటి చేయబోతున్నారు.

ఇక అసలు విషయానికొస్తే గత కొన్ని ఎన్నికల నుండి మెగాస్టార్ చిరంజీవి ఎవరికీ మద్దతుగా నిలిస్తే ఆ ప్యానల్ సభ్యులు మా అధ్యక్ష పీఠం సొంతం అవడం చూస్తున్నాం. ఇక ఈ సారి తమకి మద్దతు ఇవ్వాలని నటుడు ప్రకాష్ రాజ్ చిరంజీవిని కలవడం దానికి చిరంజీవి కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఈ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.

అది అలా ఉంటే గతంలో చిరు, మోహన్ బాబు ఫ్యామిలీ ల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనేలా ఉన్న కొన్ని పరిస్థితుల తర్వాత ఇద్దరి మధ్య అన్ని సద్దుమణిగి ఒకరికోరు మంచి మిత్రులుగా మారిపోయారు. కాని ప్రకాష్ రాజ్ కి చిరు ఓకే చెప్పాడంటే మంచు ఫ్యామిలీకి 'నో' అని చెప్పకనే చెప్పినట్లని అదే జరిగితే ప్రస్తుతం ఉన్న "మా" ఎన్నికల విషయంలో మరోసారి ఇరువురి మధ్య విభేదాలు రావోచేమో సిని వర్గాలు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికే విమర్శలు ప్రతి విమర్శలతో మా అసోసియేషన్ హాట్ హాట్ గా మారిపోయింది. సెప్టెంబర్ లో జరగబోయే ఈ ఎన్నికల్లో నిలిచేది ఎవరు..? గెలిచేది ఎవరు..? ముందులాగే "మా" పై మెగా స్టార్ మార్క్ ఉండబోతుందో లేదో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే..!!

Show Full Article
Print Article
Next Story
More Stories