మోహన్ లాల్ మరియు వెంకటేష్ చేసిన తప్పు అదేనా

Did Mohanlal and Venkatesh Make a Mistake?
x

మోహన్ లాల్ మరియు వెంకటేష్ చేసిన తప్పు అదేనా

Highlights

*మోహన్ లాల్, వెంకటేష్ పొరపాటు చేశారా?

Mohanlal and Venkatesh: కొన్నిసార్లు బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా ఎంతో కొంత నష్టపోవాల్సి వస్తుంది. తాజాగా ఇప్పుడు విక్టరీ వెంకటేష్ మరియు మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. దృశ్యం సినిమా మలయాళం లో మాత్రమే కాక తెలుగులో కూడా భారీ బ్లాక్ బస్టర్ ఆయన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్ గా "దృశ్యం 2" ను మాత్రం ఇద్దరు స్టార్లు ఓటీటీలలోనే విడుదల చేశారు. కరోనా సమయంలో మళ్ళీ మోహన్ లాల్ "దృశ్యం 2" సినిమాని ఓటీటీలో విడుదల చేయగా ఆ సినిమాకి రీమేక్ ను కూడా వెంకటేష్ ఓటీటీలోనే రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు అదే వారు చేసిన అతి పెద్ద పొరపాటు లాగా కనిపిస్తోంది. ఎందుకంటే "దృశ్యం 2" హిందీ వర్షన్ ఇప్పుడు బాక్సాఫీస్ ని కుదిపేస్తోంది.

అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ గా నిలిచి కాసుల వర్షం కురిపిస్తుంది. అసలు ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నుంచి ఒక్క హిట్స్ సినిమా కూడా రావటం లేదు అనుకున్న సమయంలో దృశ్యం 2 బాలీవుడ్ కి ఒక వరం కా దొరికింది. మల్టీప్లెక్స్ లకు 60 శాతం రెవెన్యూ సౌత్ సినిమాల నుంచి వస్తుంది అని వార్తలు వింటున్న సమయంలో బాలీవుడ్ కి కూడా కొంత "దృశ్యం 2" వల్ల కొంత ఊరట లభించింది. గతంలో వెంకటేష్ "నారప్ప" తో కూడా అదే పొరపాటు చేశారు. బి సెంటర్ ప్రేక్షకులకు ఆ సినిమా చాలా బాగా నచ్చింది. అలాగే "దృశ్యం 2" సినిమాలో కూడా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూసే కంటెంట్ ఉంది. కానీ రెండు సినిమాలు ఓటీటీలలోని విడుదలవడం వల్ల థియేటర్ లు రెండు సూపర్ హిట్ సినిమాలను మిస్ అయ్యాయని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories