Chiranjeevi: కథ వినకుండానే పూరీకి మెగాస్టార్ ఓకే చెప్పారా?

Chiranjeevi: రెండు సినిమాలు లైన్ లో పెట్టేసిన మెగాస్టార్

Jyothi
Published on: 11 March 2023 5:35 PM IST
Did Megastar Say okay to Puri without Hearing the Story?
X

Chiranjeevi: కథ వినకుండానే పూరీకి మెగాస్టార్ ఓకే చెప్పారా?

Chiranjeevi: ఈ మధ్యనే సంక్రాంతి సందర్భంగా విడుదలైన "వాల్తేరు వీరయ్య" సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి సినిమాలపై కూడా అభిమానులకు భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్" అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్లో సూపర్ హిట్ అయిన "వేదాళం" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. తమన్నా మరియు కీర్తి సురేష్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి రెండు ఆసక్తికరమైన సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. "భోళా శంకర్" సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన కూతురు సుస్మిత కొణిదల నిర్మాణంలో ఒక సినిమా చేయబోతున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుస్మిత కొణిదల మరియు తన భర్త విష్ణు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకి దర్శకత్వం వహించడం కోసం ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పి ఎస్ మిత్రన్ ను రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. చిరంజీవి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పూరీ జగన్నాథ్ చిరంజీవికి ఇంకా పూర్తి కథ చెప్పలేదట. ఒకవేళ స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చితే ఈ సినిమా ని డి వీ వీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తారు.

Jyothi

Jyothi

Next Story