చిరంజీవి చేతుల్లోకి వెళ్ళిన ప్రభాస్ కథ

Prabhas Story: ఈ మధ్యనే "ఆచార్య" సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో ఇప్పుడు మూడు నుంచి నాలుగు సినిమాలు ఉన్నాయి.

Arun Chilukuri
Updated on: 18 Jun 2022 9:00 PM IST
Did Chiranjeevi Just Grab Prabhas Story?
X

చిరంజీవి చేతుల్లోకి వెళ్ళిన ప్రభాస్ కథ

Prabhas Story: ఈ మధ్యనే "ఆచార్య" సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో ఇప్పుడు మూడు నుంచి నాలుగు సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ చిరంజీవి ఇంకా ప్రాజెక్టులు సైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు డైరెక్టర్లు మరియు రైటర్ లను కలుస్తున్నట్లు ఒక మంచి స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ఈ మధ్యనే లోకనాయకుడు కమల్ హాసన్ మరియు ఈ మధ్యనే "విక్రమ్" సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న డైరెక్టర్ లోకేష్ ను తన ఇంటికి పిలిచి మరీ సన్మానించినట్టు తెలుస్తోంది. గతంలో లోకేష్ కనగరాజ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఒక కథ వినిపించగా ప్రభాస్ ఆ కథకు నో చెప్పారు. అయితే తాజా సమాచారం ప్రకారం లోకేష్ కనగరాజ్ ఆ కథను మెగాస్టార్ కి చెప్పినట్లు సమాచారం.

అయితే కథలో చిరంజీవి కొన్ని మార్పులు చెప్పారట. ఆ మార్పులు చేస్తే చిరంజీవి లేదా రామ్ చరణ్ లలో ఎవరో ఒకరు ఈ సినిమాని టేకప్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్తో కూడా చేతులు కలపడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మరో వైపు ప్రభాస్ కోసం రాసిన కథ చిరంజీవి చేతుల్లోకి వెళ్లింది అనే వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story