"గని" సినిమా బాగాలేదని అల్లు అరవింద్ ముందే చెప్పారా?

Allu Arvind: ఈ మధ్యనే "గద్దలకొండ గణేష్" సినిమా తో హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో కలిసి "గని" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Arun Chilukuri
Updated on: 9 April 2022 10:00 PM IST
Did Allu Arvind Say Earlier that Gani Movie is not Good
X

"గని" సినిమా బాగాలేదని అల్లు అరవింద్ ముందే చెప్పారా?

Allu Arvind: ఈ మధ్యనే "గద్దలకొండ గణేష్" సినిమా తో హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో కలిసి "గని" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా లో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఏప్రిల్ 8, 2022 న థియేటర్లలో విడుదలైంది కానీ ఫ్లాప్ టాక్ తో ముందుకు వెళుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నిజానికి ఈ సినిమా చూసిన నప్పుడు అల్లు అరవింద్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడదని, కొన్ని మార్పులు చేయడం మంచిదని సలహా ఇచ్చారట. కానీ ఈ సినిమాని నిర్మిస్తున్న అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ మరియు డైరెక్టర్ కిరణ్ మాత్రం అల్లు అరవింద్ మాటలు వినలేదని తెలుస్తోంది. మళ్లీ మళ్లీ ఈ సినిమాని రీషూట్ చేయటం ఇష్టంలేక అలానే విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కానీ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ ను అందుకుంటుంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ నష్టాలు కలగడంతో తలలు పట్టుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story