Mrunal Thakur: 'సీత' ప్రేమలో పడిందా.? మృణాల్ ట్వీట్ అర్థం అదేనా..

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్‌ తాజాగా ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌ అవుతోంది.

Shashank Gullapelli
Published on: 17 Aug 2024 9:51 PM IST
Did actress mrunal thakur in love Latest tweet goes viral
X

Mrunal Thakur: 'సీత' ప్రేమలో పడిందా.? మృణాల్ ట్వీట్ అర్థం అదేనా..

Mrunal Thakur: మరాఠి సినిమా ఇండస్ట్రీ ద్వారా వెండి తెరకు పరిచయమైంది అందాల తార మృణాల్ ఠాకూర్‌. తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ చిన్నది.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో తన అద్భుత నటన, అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. సీత పాత్రకు వందశాతం న్యాయం చేసింది మృణాల్‌. ఎమోషనల్‌ సీన్స్‌లో అద్భుతన నటనను కనబరించింది. సీతారామమ్‌ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించింది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్‌ తాజాగా ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌ అవుతోంది. ఈ బ్యూటీ ప్రేమలో ఉందా అన్న అనుమాలకు తావిచ్చేలా ఉందా ట్వీట్‌. ఇంతకీ ఈ బ్యూటీ చేసిన ఏంటనేగా మీ సందేహం. నిత్యం ఫొటో షూట్స్‌, తన లేటెస్ట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మృణాల్‌ తాజాగా ఎక్స్‌లో ఒక హార్ట్‌ సింబల్‌ను పోస్ట్ చేసింది. దీంతో ఈ బ్యూటీ ప్రేమలో ఉందన్న వార్తలకు బలం చేకూరిచ్చినట్లైంది. మృణాల్‌ ఠాకూర్‌ ఎవరితో ప్రేమలో ఉందని వార్తలు ఊపందుకున్నాయి.

త్వరలోనే తన పెళ్లి గురించి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు అప్పుడే వార్తలు వడ్డిచ్చేస్తున్నారు. అయితే ఇందులో ఏమేర నిజం ఉందన్న దానిపై మాత్రం క్లారిటీ రావాల్సిందే. కొందరు మృణాల్‌ ప్రేమలో ఉందని కామెంట్స్‌ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఇదేదో కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగం అయ్యుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై మృణాల్‌ స్పందిస్తే కానీ అసలు విషయం ఏంటో తెలియదు. ఇక కెరీర్‌ విషయానికొస్తే మృణాల్‌ చివరిగా విజయ్‌ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్‌ మూవీలో నటించిన విషయం తెలిసిందే. కాగా ప్రభాస్‌, హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో మృణాల్‌ హీరోయిన్‌గా నటించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story