
Dhurandhar 2 Trailer Review: లియారీలో విధ్వంసం చూస్తారు.. 'ధురంధర్ 2' ట్రైలర్ రివ్యూ!
Dhurandhar 2 Trailer Review: సుమారు మూడున్నర నిమిషాల నిడివి గల ధురంధర్ 2 ట్రైలర్ పూర్తిగా యాక్షన్, థ్రిల్‌తో నిండిపోయింది. ఇందులో రణ్‌వీర్ సింగ్ ‘జస్కిరత్ సింగ్’ పాత్రలో కనిపిస్తూ శత్రువులపై ఊచకోత కోసినట్టు చూపించారు. ట్రైలర్ మొత్తం లియారీ నగరంలో జరిగే గ్యాంగ్ వార్ చుట్టూ తిరుగుతుంది.
Dhurandhar 2 Trailer Review: ఎప్పటినుంచో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు సొంతం చేసుకుంది. గత సంవత్సరం వచ్చిన ‘ధురంధర్’ చిత్రం సంచలన విజయాన్ని సాధించడంతో.. దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
లియారీ గ్యాంగ్ వార్‌కు ట్రైలర్‌లోనే శాంపిల్:
సుమారు మూడున్నర నిమిషాల నిడివి గల ధురంధర్ 2 ట్రైలర్ పూర్తిగా యాక్షన్, థ్రిల్‌తో నిండిపోయింది. ఇందులో రణ్‌వీర్ సింగ్ ‘జస్కిరత్ సింగ్’ పాత్రలో కనిపిస్తూ శత్రువులపై ఊచకోత కోసినట్టు చూపించారు. ట్రైలర్ మొత్తం లియారీ నగరంలో జరిగే గ్యాంగ్ వార్ చుట్టూ తిరుగుతుంది. రెహమాన్ డెకాయిట్ మరణం తర్వాత లియారీ నగరంలో హమ్జా ఎలా ప్రభావం చూపించాడు?, ఆ నగరంలో జరిగిన గ్యాంగ్ వార్ ఎలా ఉద్ధృతమైంది?, చివరికి ఇండియన్ స్పై జస్కిరత్ సింగ్ టెర్రరిస్టులను ఎలా అంతం చేశాడు? అనే ఆసక్తికర అంశాలను ట్రైలర్‌లో చూపిస్తూ క్యూరియాసిటీ పెంచారు.
రణ్‌వీర్ యాక్షన్, ఎమోషన్ రెండూ హైలెట్:
ట్రైలర్‌లో రణ్‌వీర్ సింగ్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ యాక్షన్ సీక్వెన్సులు, గన్స్ ఫైట్స్, ఛేజింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే జస్కిరత్ సింగ్ పాత్రకు సంబంధించిన ఎమోషనల్ ఫ్లాష్ షాట్స్ కూడా ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి. దర్శకుడు ఆదిత్య ధర్ తన స్టైలిష్ మేకింగ్‌తో సినిమాను మరింత గ్రాండ్‌గా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.
గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్:
ట్రైలర్‌లో మరో ముఖ్యమైన అంశం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన బీజీఎం యాక్షన్ సీన్స్‌ను మరింత ఎలివేట్ చేస్తూ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ట్రైలర్ మొత్తానికి ఈ మ్యూజిక్ ప్రత్యేకమైన ఎనర్జీ ఇచ్చిందని చెప్పాలి.
భారీ తారాగణంతో ‘ధురంధర్ 2;’
ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్‌గా సారా అర్జున్ నటించింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది. మొత్తం మీద ట్రైలర్ చూస్తే ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించనుంది. యాక్షన్, దేశభక్తి, ఎమోషన్ కలయికతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఈ సినిమా సిద్ధమవుతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




