Dhruv Vikram: విగ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న ధ్రువ్ విక్రమ్

Dhruv Vikram: ఈ గ్యాప్ లో మరో సినిమా చేయనున్న ధ్రువ్

admin1
Published on: 1 Dec 2021 1:54 PM IST
Dhruv Vikram going to be do a Film in Vignesh Shivan Direction
X

విగ్నేష్ శివన్ దర్శకత్వంలో సినిమా చేయనున్న ధృవ్ విక్రమ్ (ఫైల్ ఇమేజ్)

Dhruv Vikram: ఈ మధ్యనే 'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ అయిన 'ఆదిత్య వర్మ' సినిమాతో తమిళ ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్. తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మహాన్ అనే సినిమాతో బిజీగా ఉన్న ధ్రువ్ విక్రమ్ ఇప్పుడు ఈ సినిమా తర్వాత మారి సెల్వరాజ్ డైరెక్టర్ గా ఒక సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే మారి సెల్వరాజ్ ఇప్పుడు ఉదయనిధి తో కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ధ్రువ్ తో చేయాల్సిన సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

అందుకే ఈ గ్యాప్ లో ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుందని విక్రమ్ అనుకున్నారట. ఈ నేపథ్యంలోనే ధ్రువ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఇక మరోవైపు మహాన్ సినిమా థియేటర్లలో కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story