Dhanush: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్

Dhanush: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమాను చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు ఆ చిత్ర యూనిట్

Kranthi
Published on: 18 Jun 2021 11:00 AM IST
Dhanush to do a Telugu Tamil Film With Sekhar Kammula
X

ధనుష్ అండ్ శేఖర్ కమ్ముల (ఫైల్ ఇమేజ్)

Dhanush: సాధారణ మనషుల జీవితాలనే కథా వస్తువుగా మలుచుకుంటూ కమర్షియల్ పంథాలో కూడా అదరగొడుతున్నారు ధనుష్. ఇక్కడ మరో విషయం ఏమంటే తెలుగు సినీ స్టార్స్ కంటే తమిళ సినీ స్టార్స్‌కు కొంత సామాజిక సృహ, సమాజం పట్ల సోయి ఎక్కువ. అందుకే అక్కడ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా సామాజిక కోణంలో సినిమాల వస్తుంటాయి. ఇక తాజాగా ధనుష్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం కర్ణన్. ఈ సినిమా కూడా సామాన్యుల జీవితాలను చర్చిస్తుంది. ఇక అది అలా ఉంటే ధనుష్ మొదటిసారి తెలుగు తమిళ హిందీ భాషాల్లో ఓ సినిమాను తెలుగు దర్శకుడితో చేయనున్నారు.

ధనుష్ తెలుగు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.

Kranthi

Kranthi

Next Story