ధనుష్ కోసం రాజకీయాల చుట్టూ తిరిగే కథ రాసిన శేఖర్ కమ్ముల

Dhanush-Sekhar Kammulas Project to Have a Period Backdrop
x

ధనుష్ కోసం రాజకీయాల చుట్టూ తిరిగే కథ రాసిన శేఖర్ కమ్ముల

Highlights

Dhanush-Sekhar Kammula: కోలివుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ధనుష్ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా మంచి ఇమేజ్ ను సంపాదించాడు.

Dhanush-Sekhar Kammula: కోలివుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న ధనుష్ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా మంచి ఇమేజ్ ను సంపాదించాడు. అయితే వీరిలో మొట్టమొదటిసారిగా ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కనిపించనున్నాడు. శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళం లో 'మారి 2' సినిమా లో ధనుష్ సరసన నటించిన సాయి పల్లవి ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ధనుష్ శేఖర్ కమ్ముల సినిమా రాజకీయ బ్యాక్ డ్రాప్ తో నడవనుందని సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా బ్రిటిషర్లు భారత దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మద్రాస్ లో జరిగిన కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ధనుష్ మద్రాస్ తెలుగు లీడర్ గా కనిపించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా సీక్రెట్ గానే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి పట్టాలు ఎక్కనుంది. మరోవైపు శేఖర్ కమ్ముల ప్రస్తుతం "లవ్ స్టోరీ" రిలీజ్ పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories