SIR Movie: తమన్ పై ప్రశంసల వర్షం కురిపించిన ధనుష్

* తమన్ పై ప్రశంసల వర్షం కురిపించిన ధనుష్

Dhatripriya
Updated on: 16 Feb 2023 4:31 PM IST
Dhanush Lifted Thaman To The Sky
X

తమన్ ను ఆకాశానికి ఎత్తేశిన ధనుష్..

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా "సార్". తమిళ్లో "వాతి" అనే టైటిల్ తో విడుదల కాబోతున్న ఈ సినిమా కి వెంకి అట్లూరి దర్శకత్వం వహించారు. తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో ధనుష్ ఒక జూనియర్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నారు. విద్యా సంస్థల నేపథ్యంలో సాగే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చునర్ ఫోర్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని, నర్ర శ్రీనివాస్, హైపర్ ఆది, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు దర్శక నిర్మాతలు. ఈ వేడుక లో మాట్లాడుతూ ధనుష్ ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

"నేను పెద్ద శివ భక్తుడిని. అఖండ సినిమాలో మీ మ్యూజిక్ అద్భుతంగా ఉంది," అని ధనుష్ తమన్ ను ఆకాశానికి ఎత్తేసారు. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదల కాబోతోంది. అదే రోజున విడుదల కావాల్సిన సమంత "శాకుంతలం" వాయిదా పడడంతో "సార్" సినిమాకి భారీ స్థాయిలో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాలి. మరోవైపు తమన్ కూడా వరుస స్టార్ హీరో సినిమాల లో బిజీగా ఉన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story