Dhanush: 'జగమే తంత్రం' కోసం అప్పటి వరకు ఆగాల్సిందేనా!

Dhanush: విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్నాడు ధనుశ్‌.

Samba Siva Rao
Published on: 23 April 2021 4:24 PM IST
Jagame Tantram Movie Soon
X

ధనుష్ మూవీ ఫైల్ ఫోటో 

Dhanush: విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్నాడు ధనుశ్‌. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుశ్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'జగమే తందిరమ్‌'. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధనుశ్‌కి ఇది 40వ సినిమా కావడం విశేషం. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

వచ్చే నెలలో చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని విడుదల చేయనున్నారట. ఈ ఏడాది జూన్‌ 11 లేదా 13వ తేదీన విడుదల చేయాలనే దానిపై చర్చలు నడుస్తున్నాయట. ధనుష్‌ ఇందులో సూరాలి అనే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇది పక్కా మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రంగా ఉండనుంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వై నాట్‌ స్టుడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వివేక్ హర్షన్‌ ఎడిటింగ్ చేస్తుండగా.. శశికాంత్‌, చక్రవర్తి, రామచంద్ర నిర్మాతలు. సంతోష్‌ నారాయణ స్వరాలు సమకూర్చారు. ధనుష్‌ ప్రధానపాత్రలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'కర్ణన్‌'. మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 9 థియేటర్లలో విడుదలయ్యి మంచి విజయం సాధించింది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story