'మజిలీ' తమిళ్ రీమేక్ లో హీరో ఇతనేనా ?

మజిలీ తమిళ్ రీమేక్ లో హీరో ఇతనేనా ?
x
Highlights

పెళ్లికి ముందు మూడు సినిమాల్లో కలిసి నటించిన సమంత, నాగచైతన్య పెళ్లి తర్వాత మొట్టమొదటి సారిగా 'మజిలీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి...

పెళ్లికి ముందు మూడు సినిమాల్లో కలిసి నటించిన సమంత, నాగచైతన్య పెళ్లి తర్వాత మొట్టమొదటి సారిగా 'మజిలీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. గత కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న నాగచైతన్య కెరీర్లో ఒక మర్చిపోలేని హిట్ అందించింది 'మజిలీ'. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఇప్పుడు తమిళంలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

అయితే ఈ సినిమాలో ధనుష్ ను హీరోగా తీసుకోవాలని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఇదివరకే ఈ కాన్సెప్ట్ తో ధనుష్ 'తంగమగన్ (తెలుగులో 'నవమన్మధుడు')' అనే సినిమా లో నటించాడు. ఈ సినిమాలో ధనుష్ ముందు ఏమీ జాక్సన్ ను ప్రేమించి తర్వాత సమంతను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించి వేరొకరిని పెళ్లి చేసుకోవడం తప్ప ఈ సినిమాలలో పెద్ద పోలికలు లేకపోయినప్పటికీ ఆల్రెడీ టచ్ చేసిన జోనర్ లో మళ్ళీ ఇంకొక సినిమా ధనుష్ చేస్తాడా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కన్నడలో ఈ సినిమాను గణేష్ రీమేక్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం అందుతోంది.





Show Full Article
Print Article
Next Story
More Stories