ఇంకా క్రిటికల్ గానే శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం.. పెద్ద మనసు చాటుకున్న హీరో ధనుష్

Dhanush Extend Support To Shiva Shankar Master
x

ఇంకా క్రిటికల్ గానే శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం.. పెద్ద మనసు చాటుకున్న హీరో ధనుష్

Highlights

Shiva Shankar: కరోనా బారిన పడిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం విషమంగా ఉంది.

Shiva Shankar: కరోనా బారిన పడిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు తెలిపారు. శివశంకర్‌ మాస్టర్‌ సతీమణి, పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన కుమారుడు ప్రస్తుతం అపస్మారకస్థితిలో ఉన్నట్లు సమాచారం. శివశంకర్‌ మాస్టర్‌ భార్య హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

ఇటీవలె ఆయన పరిస్థితి తెలుసుకొని నటుడు సోనూసూద్‌ సాయం చేసేందకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ సైతం శివ శంకర్‌ మాస్టర్‌ చికిత్స కోసం పది లక్షల రూపాయలు ఇచ్చారని సమాచారం. శివశంకర్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌గా దేశంలోని అన్ని భాషల్లో సుపరిచితుడే. 10 భాషలకు పైగానే కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో పలు చిత్రాలకు ఆయన నృత్యరీతులు సమకూర్చారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 800 చిత్రాలకుపైగానే డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేశారు. పలుభాషల్లో ఉత్తమ అవార్డులు తీసుకున్నారు. తెలుగులో ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రానికి గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ ఫిల్మ్‌ అవార్డు అందుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories