Dhanush - Sekhar Kammula: స్క్రిప్ట్ లో మార్పులు చేయమంటున్న ధనుష్

* ఊరికే పై పై న చూపించకుండా కొన్ని సన్నివేశాల ఇంటెన్సిటీ పెంచితే బాగుంటుందని ధనుష్ అభిప్రాయం.

admin1
Updated on: 30 Sept 2021 5:39 PM IST
Danush Asking Sekhar Kammula to Change the Script for New Movie
X

శేఖర్ కమ్ముల - ధనుష్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Dhanush - Sekhar Kammula: టాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే 'లవ్ స్టోరీ" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ధనుష్ కోసం రాసిన స్క్రిప్ట్ ధనుష్ అంతగా నచ్చలేదట.

అందుకే స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయమని అడుగుతున్నారని సమాచారం. సెన్సార్ దృష్టిలో పెట్టుకుని చాలా వరకు తెలుగు సినిమాలలో కుల మత కలహాలు, లైంగిక వేధింపుల విషయాల్లో సన్నివేశాలని కొంచెం సెన్సిటివ్ వే లో చూపించటం తెలుగు దర్శకులకి అలవాటే.

కానీ తమిళ్ స్టార్ హీరో ధనుష్ కి "అసురన్", "కర్ణన్" సినిమాలలో ఎంత వయోలెన్స్ ఉన్నప్పటికీ అవి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శేఖర్ కమ్ముల, ధనుష్ ల మధ్య కొన్ని విభేదాలు వస్తున్నాయట. ధనుష్ స్క్రిప్ట్ విషయంలో కొంచెం ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. ఊరికే పై పై న చూపించకుండా కొన్ని సన్నివేశాల ఇంటెన్సిటీ పెంచితే బాగుంటుందని ధనుష్ అభిప్రాయం.

కానీ అది తమిళ ఇండస్ట్రీలో వర్క్ అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో వర్క్ అయ్యే అవకాశం లేదు. సెన్సార్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలని చూడాలని ఆసక్తి చూపించారు. మరి ఈ నేపథ్యంలో ధనుష్ కోరిక మేరకు శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ మారుస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story