ధనుష్-మృణాల్ ఠాకూర్ పెళ్లి ఫిక్స్? వచ్చే నెలలోనే ముహూర్తం.. నెట్టింట వైరల్ అవుతున్న డేట్!

ధనుష్-మృణాల్ ఠాకూర్ పెళ్లి ఫిక్స్? వచ్చే నెలలోనే ముహూర్తం.. నెట్టింట వైరల్ అవుతున్న డేట్!
x
Highlights

Dhanush and Mrunal Thakur Marriage Rumors: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ త్వరలోనే మళ్ళీ ఇంటివాడు కాబోతున్నారా?

Dhanush and Mrunal Thakur Marriage Rumors: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ త్వరలోనే మళ్ళీ ఇంటివాడు కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియా కథనాలు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో విడిపోయిన తర్వాత సింగిల్‌గా ఉంటున్న ధనుష్, ఇప్పుడు 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్‌తో ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది.

డేటింగ్ రూమర్లకు బలం చేకూర్చిన సంఘటనలు

ధనుష్, మృణాల్ మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

బర్త్‌డే పార్టీ: ఇటీవల మృణాల్ ఠాకూర్ బర్త్‌డే వేడుకల్లో ధనుష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో ధనుష్ కనిపించడంతో వీరిద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందనే అనుమానాలు మొదలయ్యాయి.

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్: మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం ధనుష్ సోదరీమణులు కార్తీక కృష్ణమూర్తి, విమల గీతలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుండటం గమనార్హం. సాధారణంగా కుటుంబ సభ్యులతో పరిచయాలు పెరిగాయంటే అది పెళ్లికి దారితీసే సంకేతమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వచ్చే నెల 14నే పెళ్లి?

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. వచ్చే నెల ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) ధనుష్-మృణాల్ వివాహం జరగనుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై అటు ధనుష్ కానీ, ఇటు మృణాల్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కేవలం రూమర్లేనా లేక నిజంగానే ఈ ఇద్దరు స్టార్స్ ఒక్కటి కాబోతున్నారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

కెరీర్ పరంగా ఫుల్ బిజీ..

వరుస హిట్‌లతో ధనుష్ దూసుకుపోతున్నారు. ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'కుబేర' చిత్రంలో బిచ్చగాడి పాత్రలో అద్భుత నటనతో మెప్పించిన ఆయన, ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు మృణాల్ కూడా టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా రాణిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories