Breaking News: ధనుష్ దంపతులు విడాకులు

Dhanush and Aishwaryaa Rajinikanth announce decision to divorce

Arun Chilukuri
Updated on: 18 Jan 2022 1:24 AM IST
Breaking News: ధనుష్ దంపతులు విడాకులు
X

టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య జంట విడాకులు గురించి మరిచిపోకముందే మరో జంట స్టార్ కపుల్ విడాకులు తీసుకున్నారు. తమిళ్ స్టార్ హీరో రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్ విడాకులు తీసుకుంటున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.అయితే ఎందుకు విడిపోతున్నారో అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా 18 ఏళ్ల క్రితం (నవంబర్ 18, 2004న) వీరిద్దరూ హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి ఇద్దరు సంతానం.

ధనుష్‌ తన లేఖలో..' మేం 18 సంవత్సరాల పాటు కలిసి ఉన్నాము. స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా , శ్రేయోభిలాషులుగా .. ఇలా ఎన్నో రకాలుగా కలిసి జీవించాం. మా మార్గాలు వేరుగా ఉన్నాయి. ఐశ్వర్య, నేను జంటగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. ఈ విషయం పట్ల మాకు అవసరమైన గోప్యతను ఇవ్వండి. ఓం నమశివాయ!" ప్రేమతో మీ ధనుష్‌' అని​ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story