మళ్లీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్న ధనుష్ మరియు ఐశ్వర్య

మళ్లీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్న ధనుష్ మరియు ఐశ్వర్య

Rama Rao
Published on: 2 Oct 2022 5:16 PM IST
Dhanush and Aishwarya decide to get back together | Telugu Movie News
X

మళ్లీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్న ధనుష్ మరియు ఐశ్వర్య

Dhanush-Aishwarya: "మేం విడాకులు తీసుకుంటున్నాం" అంటూ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరియు ఆయన భార్య ఐశ్వర్య సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే ధనుష్- ఐశ్వర్య లు తమ విడాకులను అధికారికంగా ప్రకటించారు. 18 ఏళ్ల వారి వివాహ బంధానికి స్వస్తి పలికారు. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యాక కూడా వారు ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను మరింత బాధించింది.

అయితే విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో తాము కలిసి ఉన్న ఫొటోలను కూడా తొలగించారు. దీంతో వీళ్ళు మళ్లీ కలవరేమో అని అంతా ఫిక్స్ అయ్యారు.కానీ ఈ మధ్యనే తమ పిల్లల కోసం స్కూల్ లో జరిగిన ఒక ఫంక్షన్ కి కలిసి హాజరవ్వగా వారి ఫొటోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇది చూశాక ఈ జంట మళ్లీ కలుస్తుందేమో అని అందరూ అనుకున్నారు. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ధనుష్ తండ్రి కూడా వారి మధ్య చిన్న గొడవలే ఉన్నాయని వారు మళ్లీ కలిసిపోతారని చెప్పారు.

ఇక తాజా సమాచారం ప్రకారం ఆయన చెప్పినట్టుగానే, అభిమానులు ఆకాంక్షించినట్టే పెద్దలు వారి మధ్య ఉన్న సమస్యను పరిష్కరించారు. దీంతో ఈ జంట వారి విడాకుల ప్రతిపాదనను విరమించుకున్నారని తెలుస్తోంది. రజనీకాంత్ మరియు ధనుష్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన చర్చల్లో పెద్దల మాటలకు గౌరవిస్తూ ధనుష్ మరియు ఐశ్వర్య కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు అని తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story